తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ మసీదుబండ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ స్వయంభు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో 03వ తేదీ మంగళవారం శ్రీ వీరాంజనేయ స్వామి దర్శనార్థమై పెద్ద సంఖ్యలో భక్తజనులు ఆలయానికి విచ్చేసి శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి సన్నిధిలో ఆలయ ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులైనారు. ఈ సందర్భంగా భక్తజనులు మాట్లాడుతు, శ్రీ స్వయంభు శ్రీ వీరాంజనేయ స్వామివారు కోరిన కోరికలు తీర్చే స్వామి అని అందరూ ఇష్ట దైవంగా కొలుస్తున్నారని, స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యే అదృష్టాన్ని కలుగచేసిన ఆలయ ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలతో ధన్యవాదాలు తెలియజేశారు.
