తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని సులేమాన్ నగర్ కార్పొరేటర్ అభ్యర్థి ఏర్వ సరిత మహేష్ పద్మశాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై కీలక సూచన చేశారు. పట్టభద్రుల ఓటు హక్కు పొందేందుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ గడువులోగా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి తేదీ కావడంతో అర్హులైన వారు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తప్పనిసరిగా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును పొందాలని ఏర్వ సరిత మహేష్ పద్మశాలి కోరారు.
