తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా, అరాచకవాదానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 2న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాపాదయాత్రను విజయవంతం చేయాలని కాటేదాన్ డివిజన్ 116 అధ్యక్షుడు గోద పాండు యాదవ్ పిలుపునిచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ మహాపాదయాత్రకు కాటేదాన్ డివిజన్ పరిధిలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. నవంబర్ 2వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిజాం కాలేజ్ సర్కిల్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద పాదయాత్ర ప్రారంభమై మొజాంజాహి మార్కెట్ వరకు కొనసాగనుంది. “ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకవాదాన్ని అంతం చేద్దాం” అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ మహాపాదయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గోద పాండు యాదవ్ విజ్ఞప్తి చేశారు.