తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి, నల్లగండ్ల ప్రధాన రహదారిలో క్రీమ్ స్టోన్ పక్కన నూతనంగా ఏర్పాటుచేసిన జ్యూస్ , హెయిర్, బ్యూటీ, నెయిల్స్, మేకప్ సెలూన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరెకపూడి గాంధీ, పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, పఠాన్ చేరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి హాజరై రిబ్బన్ కట్ చేసి సెలూన్ ను లాంఛనంగా ప్రారంభించిన కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అఖిల్ , ఆశా లను ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అభినందించారు. అనంతరం కార్పొరేటర్  రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ, శేరిలింగంపల్లి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఇలాంటి అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ సెలూన్లు రావడం సంతోషకరమని అన్నారు. టాప్-టైర్ సౌకర్యాలు, లగ్జరీ ప్రొడక్ట్స్ తో ఈ సెలూన్ స్థానికులకు మంచి సేవలు అందిస్తుందని నిర్వాహకులు అఖిల్ & ఆశా లకు మంచి విజయం చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.