తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి నియోజకవర్గం లోని కేపీహెచ్‌బీ కాలనీ రమ్యా గ్రౌండ్స్‌లో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి విజయాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో భారీ ఎత్తున గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గ్రాడ్యుయేట్లు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లలో కనిపించిన ఉత్సాహం, విశేష స్పందన కాంగ్రెస్ పార్టీ పట్ల వారికున్న విశ్వాసాన్ని ప్రతిబింబించింది. కాంగ్రెస్ నాయకులు
రంగమోహన్, నలినీకాంత్, రవి, కళ్యాణ్, రమణల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఓటర్లతో సమన్వయం చేసుకుంటూ ఓటరు నమోదు ప్రక్రియ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, గ్రాడ్యుయేట్ల భాగస్వామ్యం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరో ముందడుగు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు ప్రజల అభివృద్ధి, సంక్షేమం, అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపిశెట్టి రాఘవేందర్, ప్రకాష్ ముదిరాజ్, సుధాకర్ రెడ్డి, తూము మనోజ్ కుమార్, ఇజాజ్, రమణ, అస్లాం, ఫణిందర్ నవాజ్, సల్మాన్ పాషా, లక్ష్మణ్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు