తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం: కొత్తగూడ బస్తి దవాఖానలో పీహెచ్సీ ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కేంద్ర ప్రభుత్వ పధకంలో భాగంగా ఎక్స్ రే, ఛాతీ పరీక్షలు తెమడ పరిక్షలు నిర్వహించారు. ఇందులో టీబీ వ్యాధికి పూర్వం మందులు వాడిన వారి కుటుంబ సభ్యులకు, షుగర్ రోగులకు, స్మోకర్స్ కు, పోషకలోపం ఉన్న వారికి 60సం. పైబడిన వారికి సుమారు150 మందికి వైద్య పరీక్షలు చేసి తగిన మందులు ఇచ్చారు. క్షయ వ్యాధిపై అవగాహన 2వారాలుగా దగ్గు, సాయంత్రం జ్వరం, ఆకలి లేక పోవడం, బరువు, తగ్గడం, శరీరంలో ఎక్కడైన గడ్డలు ఉన్నచో దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా పరీక్షలు మందులు దొరికుతాయని, క్షయ వ్యాధిన పడిన వారికి నెలకు పోషణ నిమిత్తం రు.1000.లు ప్రతినెల ఓబీటీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో భాగంగా డబ్ల్యూహెచ్ఓ కన్సెల్టెంట్ డాక్టర్లు మాట్లాడుతు, ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో క్షయ రహిత సమాజాన్ని నిర్మించగలమని ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు, సీహెచ్ఓ షాహెద్, సూపర్ వైజర్ భీములు , స్తుతిమాల పాల్గొన్నారు. తెమడ పరీక్షలు, 45మందికి ఎక్స్ రే లు చేయడం, ఒక టిబీ పాజిటీవ్ రావడం జరిగిందని తెలిపారు.
