తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నాయి బ్రాహ్మణ అసోసియేషన్ సభ్యులు దసరా పండుగను పురస్కరించుకుని నల్లగండ్లలోని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్వగృహానికి మర్యాదపూర్వకంగా విచ్చేసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ను శాలువాలతో ఘనంగా సన్మానించి సంఘం తరపున జ్ఞాపికను బహుకరించారు. నాయి బ్రాహ్మణ సంఘం వారు మాట్లాడుతూ, శేరిలింగంపల్లి డివిజన్ లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చేపడుతున్న అభివృద్ధి పనులు అభినందనీయమని కొనియాడారు. ముఖ్యంగా మా నాయి బ్రాహ్మణ సంఘాన్ని గుర్తించి మా పట్ల దయతలిచి గోపినగర్ లో తన సొంత ఖర్చులతో కమ్యూనిటీ భవనాన్ని నిర్మించి ఇచ్చి అన్ని విధాలుగా మా సంఘానికి అండగా నిలిచారని తెలిపారు. ఇలాంటి కార్పొరేటర్ ఉండటం మా అదృష్టమని వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో మా సంఘం అన్ని విధాలుగా వారి వెన్నంటే ఉంటామని తెలిపారు. అనంతరం, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ, దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. గోపినగర్ లోని కమ్యూనిటీ భవనాన్ని సంఘ సమావేశాలు అధికారిక కార్యక్రమాలకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాయి బ్రాహ్మణ సంఘం అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భవిష్యత్తులో కూడా ఎల్లవేళలా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నాయి బ్రాహ్మణ అసోసియేషన్ అధ్యక్షులు సాయన్న, ప్రధాన కార్యదర్శి ముత్యాల రవిందర్, ఉపాధ్యక్షులు పరుశురాం, కోశాధికారి బీదర్ కోట శేఖర్, చైర్మన్ రవికుమార్, వైస్ చైర్మన్ మాణిక్ ప్రభు, గౌరవ అధ్యక్షులు భాస్కర్ మైలారం సురేష్, ముఖ్య సలహదారులు ముత్యాల జనార్ధన్, దైవపూజ దశరథ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు సత్యం, మల్లేష్ కుమార్, పగడాల సాయికుమార్, ప్రచార కార్యదర్శులు ఆలిండ్ బాల్రాజ్, కె.కె సత్తి రాజు, జాయింట్ సెక్రటరీలు జగదీష్, బిక్షపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీలు నరేష్, వెంకటేష్, కార్యదర్శులు విజయ్ కుమార్, విఠల్, వెంకటేష్ తాండ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ బల్వంత్ కుమార్, అనిల్ కుమార్, ఆనంద్, మల్లేష్, మహేందర్, రాజు, దేవేందర్, శ్రీనివాస్, విజయ్, సతీష్, కార్యవర్గ సభ్యులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
