తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ సీఎమ్సి కమిషనర్ శ్రీమతి సృజన ను కలిసి కూకట్పల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్కుల అభివృద్ధి, స్వాన్ లేక్ నాలా, బాలానగర్ నాలా, 6వ ఫేజ్ స్పేస్‌లోని పార్కు రిటైనింగ్ వాల్ నిర్మాణం, సబ్దాన్నగర్, రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతాల్లో డోర్ నంబర్ల సమస్యలు, భూమన విజయ కోర్టు ఇండోర్ స్టేడియం, మూసాపేట్ రోడ్డు విస్తరణ, కాజాకుంటలో రజకుల కోసం షెడ్డు, బోరు ఏర్పాటు వంటి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వై జంక్షన్ ఫ్లైఓవర్ పనులు, అల్లాపూర్‌లోని ఇందు గ్రేవ్‌యార్డ్ సమస్య, కూకట్పల్లి నియోజకవర్గంలో లైబ్రరీ ఏర్పాటుకు స్థలం కేటాయింపు, ఎస్ఎన్డీపీ పనుల్లో భాగంగా బాలానగర్ నాలా, జింకలవాడ నాలా అభివృద్ధి, నల్లచెరువు ప్రాంతంలో స్టాల్స్ ఏర్పాటు, విద్యుత్ సమస్యలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన పనులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, వివిధ శాఖల సమన్వయంతో ప్రజా సమస్యలను పరిష్కరించాలని బండి రమేష్ కోరారు.
