తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం; నల్లగండ్ల పరిధిలోని స్థానిక నివాసితులైన బాలకృష్ణ తన నూతన గృహప్రవేశ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని శాస్త్ర యుక్తంగా వేద పండితులచే నిర్వహిస్తున్న శ్రీ సత్యనారాయణ వ్రతం పూజా కార్యక్రమానికి నూతన గృహ యజమానులు బాలకృష్ణ ఆహ్వానం మేరకు స్థానిక సీనియర్ నాయకులైన శ్రీనివాస్ రెడ్డి, సామ్రాట్ లు శ్రీ సత్యనారాయణ వ్రత పూజలలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి, సామ్రాట్ లు మాట్లాడుతూ, శ్రీ సత్యనారాయణ స్వామి వారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా బాలకృష్ణ కు వారి కుటుంబీకులకు ఉండాలని ఆకాంక్షించారు. నూతన గృహ ప్రవేశ సందర్భంగా బాలకృష్ణకు హృదయపూర్వకంగా శుభాశీస్సులు అందజేశారు.