తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ నూతన షోరూమ్ ను ప్రారంభించారు. బీఆర్ ఎస్ యూత్ నాయకులు సయ్యద్ ముజీబ్ ఆహ్వానం మేరకు ప్రారంభమైన సయ్యద్ ముజీబ్ షూస్ అండ్ ఆక్సెస్రీస్,మైన్ మైన్ కిడ్స్ వేర్ నూతన షోరూమ్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ బిఆర్ స్ కార్పొరేటర్ అభ్యర్థి మహమ్మద్ అలావుద్దీన్ పటేల్ పాల్గొన్నారు. మొహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్ నూతన వ్యాపార సంస్థలను ప్రారంభించిన యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రముఖులు, యువ నాయకులు , అభిమానులు పాల్గొన్నారు.
