తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి డివిజన్, పాపిరెడ్డి కాలనీలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం బీఎల్‌ఏలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కాలనీలోని సీనియర్ మహిళా నాయకురాలు కె. కనకలక్ష్మి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కె. కనకలక్ష్మి మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్ కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా భాగస్వామి కావాలని కోరారు. బిఎల్ఎ లు అందజేసే ఎమ్యూనరేషన్ ఫారంలో తమ పూర్తివివరాలను సక్రమంగా నమోదుచేసి ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు. బూతు లెవెల్ అధికారులు సర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటరుగా నమోదు కావడం అత్యంత ముఖ్యమని పేర్కొంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంతో ఓర్పుతో ప్రతి ఒక్కరి వివరాలను ఫారాలలో పొందుపరుస్తున్న బిఎల్ఏలను ప్రత్యేకంగా అభినందనందించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.