తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం18వ తేదీ మంగళవారం సాయంత్రం 3గంటలకు ట్యాంక్ బండ్ పై బహుజన వీరుడు, వీరత్వానికి ప్రతీక, బహుజన ఆత్మగౌరవానికి స్ఫూర్తి, సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ , దుద్దిల శ్రీధర్ బాబు , శాసన మండలి సభ్యులు, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ఘనంగా నిర్వహించిన వేడుకలలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ తో కలిసి శేరిలింగంపల్లి కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షురాలు మల్లెల జయ పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్బంగ మల్లెల జయ మాట్లాడుతు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ధైర్యానికి ప్రతీక, ఆయన పోరాటం సమానత్వానికి స్ఫూర్తి, ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం నిలబడే ప్రతి ఒక్కరికీ ఆయన జీవితం మార్గదర్శకం అని కొనియాడారు.
