తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ హుడాకాలనీ లోని హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ ను తెలంగాణ రాష్ట్ర మహాసభ, నూతన శేరిలింగంపల్లి మండల మహాసభ కార్యవర్గం మరియు బస్తీ సంఘాల ప్రతినిధులతో కలిసి శేరిలింగంపల్లి మండల ఆర్యవైశ్య మహాసభ మండల జనరల్ సెక్రటరీగా సేవా రత్న పోలా కోటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన శేరిలింగంపల్లి మండల ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులందరిని కొండా విజయ్ కుమార్ కు పోలా కోటేశ్వరరావు పరిచయం చేశారు. అనంతరం, కొండా విజయ్ కుమార్ తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సమాజానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆత్మీయంగా చర్చించారు. ఈ సమావేశంలో శేరిలింగంపల్లి మండల మహాసభ అధ్యక్షులు మాశెట్టి ప్రభాకర్ గుప్తా, శేరిలింగంపల్లి మండల మహాసభ జనరల్ సెక్రటరీ పోలా కోటేశ్వర్ రావు , శేరిలింగంపల్లి మండల మహాసభ ట్రెజరర్ బి.ఎస్.లింగం, శేరిలింగంపల్లి మండల మహాసభ వ్యవస్థాపకులు గోలి రాజు గుప్తా, శేరిలింగంపల్లి మండల మహాసభ వైస్ ప్రెసిడెంట్ కొండూరి జగన్మోహన్ గుప్తా, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సెక్రటరీ ముక్క పృథ్వీ గుప్తా, మాదాపూర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొత్త అశోక్ గుప్తా, శేరిలింగంపల్లి మండల మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి రేఖా గుప్తా, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆనంద్ ఉప్పుగండ్ల గుప్తా, కొండాపూర్ గంప సంతోష్ గుప్తా, ఏవీఎస్, కొండాపూర్ కమలాకర్ యమ్సాని, సెక్రటరీ, ఏవీఎస్, కొండాపూర్ పాండు గుప్తా, మాశెట్టి శ్రీనివాస్ గుప్తా, కిషోర్ గుప్తా, సిద్ధిఖ్‌నగర్ ఎం.ఎస్. ప్రసాద్, ఎం. పుల్లయ్య, బాలరాజ్ గుప్తా, అశోక్ గుప్తా, కొల్కూరి శ్రీనివాస్ గుప్తా, దొంతుల సుధాకర్, పలు ఆర్య వైశ్య మహాసభ నాయకులు, సంఘాల ప్రతినిధులు, కమ్యూనిటీ పెద్దలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా విజయ్ కు విలువైన సమయాన్ని కేటాయించి, ఆర్యవైశ్య సమాజ ప్రతినిధులతో ఆత్మీయంగా సమావేశమైనందుకు ఆర్యవైశ్య సమాజ ప్రతినిధులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
