తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  నార్సింగి సర్కిల్‌ నెక్నాంపూర్‌ డివిజన్‌ పరిధిలోని అల్కాపూర్‌ టౌన్‌షిప్‌లో మహాత్మా గాంధీ పార్కు పునరుద్ధరణ పనులకు రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు పిల్లలు, మహిళలు, వృద్ధులకు ఉపయోగపడేలా పార్కును మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పార్కులో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
పునరుద్ధరణ పనులు పూర్తయితే స్థానికులకు మెరుగైన వాకింగ్‌, వ్యాయామం, విశ్రాంతి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.