• మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి: ఆర్. కృష్ణయ్య
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, బీసీ ఉద్యమ నాయకులు గుజ్జ సత్యం జన్మదిన వేడుకలు విద్యానగర్లోని బీసీ భవన్లో ఘనంగా జరిగాయి. సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి బీసీ సంఘాల నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పుష్పగుచ్ఛాలు అందజేసి గుజ్జ సత్యంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, గుజ్జ సత్యం బీసీ ఉద్యమంలో మరింత చురుకైన పాత్ర పోషిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ప్రజాసేవలో మరింత గుర్తింపు పొందాలని ఆశీర్వదించారు. బీసీ సమాజ అభ్యున్నతి కోసం సత్యం చేస్తున్న కృషి మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో వివిధ బీసీ కుల సంఘాల నాయకులు, జిల్లా స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు. వేడుకలు ఆత్మీయ వాతావరణంలో ఉత్సాహంగా సాగాయి.
