తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: కొత్తగూడ గ్రామంలో ఉన్న బస్తీ దవాఖానకు సమీప ప్రాంతవాసులు విచ్చేసి ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పినట్లుగా బస్తీ దవాఖానలోని ఆరోగ్య పరీక్షలను సద్వినియోగ పరచుకుని ఆరోగ్య వాతావరణాన్ని కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరీక్షలను సద్వినియోగ పరచుకున్న వారు మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిన వారికి, బస్తీ దవాఖానాలో ఓర్పుతో ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేస్తూ, తగు జాగ్రత్తలను సూచిస్తూ, అవసరమైన మందులను అందజేస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పినట్లుగా ఆరోగ్య వాతావరణాన్ని కల్పించేందుకు శాయశక్తులా విధి నిర్వహణలో అంకితభావంతో సేవలందిస్తున్న వైద్య బృందానికి మనస్పూర్తిగా అభినందిస్తూ, కృతజ్ఞతా భావంతో ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య బృందం మాట్లాడుతూ, వైద్యవృత్తిలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ బస్తీ దవాఖానలోని వైద్యసేవలను సద్వినియోగ పరచుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని సూచించారు
