తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన ఎస్‌బి స్టోర్ నిత్యవసర సరుకుల దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై రిబన్ కట్ చేసి స్టోర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ఎస్‌బి స్టోర్ సూపర్ మార్కెట్ ను హైదరాబాద్ లోనే మొట్టమొదటి స్టోర్ ను మన పీజేఆర్ నగర్ లో ప్రారంభించడం ఎంతో ఆనందించదగ్గ విషయమని అన్నారు. ఎక్కువ స్టోర్స్ ఏర్పాటుచేస్తే ఇక్కడ ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయని తెలియచేశారు. కంపెనీ అధిపతి కూకట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న 13,266స్టోర్లలో కేవలం హైదరాబాద్‌లోనే 700 స్టోర్లను ప్రారంభించాలని ప్రణాళిక వేస్తున్నామని తెలిపారు. ఈ స్టోర్‌లో భౌతికంగా4000రకాల వస్తువులు అందుబాటులో ఉండగా, ఆన్‌లైన్ ద్వారా2లక్షల వస్తువులు లభిస్తాయని అన్నారు. ఇప్పటివరకు మేము11స్టోర్లను ప్రారంభించి, వాటిని విజయవంతంగా నడుపుతూ3500మందికి పైగా వినియోగదారులకు సేవలు అందించామని తెలియచేశారు. ఈ ప్రతిష్టాత్మక స్టోర్‌ను ఎల్లమ్మబండకు చెందిన కోటేశ్వరరావు భార్య శ్రీమతి వెంకటేశ్వరికి ఫ్రాంచైజీ ద్వారా కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, సీహేచ్. భాస్కర్, యాదగిరి, సంగమేష్, మహేష్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు