తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లిలోని శ్రీ హేమ దుర్గా భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రెండోసారి నియమితులైన శ్రీమతి రాజనోళ్ల లక్ష్మీ టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండి రమేష్ కు శాలువా కప్పి సత్కరించి, కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా బండి రమేష్ రాజనోళ్ల లక్ష్మీకు రెండోసారి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. మహిళా కాంగ్రెస్ బలోపేతానికి ఆమె మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంధ్య, రమాదేవి, కృష్ణవేణి, సరోజ, రజిని, రాజేశ్వరి, అపర్ణ, జయలక్ష్మి, జోజమ్మ తదితరులు పాల్గొన్నారు.