తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన వీరబోయిన రజితను తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
నవంబర్ 20న గురువారం సాయంత్రం హైదరాబాద్లోని దమ్మాయిగూడ (ఈసీఐఎల్)లో ఉన్న వీరబోయిన రజిత నివాసానికి వెళ్లిన రాపోలు వీరమోహన్, ఆమెకు పుష్పగుచ్ఛం అందించి నియామకంపై శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి ఆత్మీయంగా సత్కరించారు.
ఈ సందర్భంగా రాపోలు వీరమోహన్ మాట్లాడుతూ.. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వీరబోయిన రజితకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా సముచిత గుర్తింపు లభించడం సంతోషకరమన్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
అనంతరం రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై ఇరువురు నేతలు ఆత్మీయంగా చర్చించుకున్నారు. ఈ వివరాలను తెలంగాణ చేనేత ఐక్య వేదిక సోషల్ మీడియా కార్యదర్శి రావిరాల శ్రీనివాస్ నేత ఒక ప్రకటనలో వెల్లడించారు.
