తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం (లేబర్ సెల్) రాష్ట్ర కో-కన్వీనర్‌గా ఉమా రెడ్డి నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆదేశాల మేరకు, సీనియర్ నాయకుల సూచనలతో చేపట్టిన సమీక్ష అనంతరం ఈ నియామకం జరిగింది. కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ అందె శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నియామక పత్రాన్ని ఉమా రెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా ఉమా రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రాష్ట్ర కో-కన్వీనర్ బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాల పట్ల, సమాజం పట్ల తనకున్న నిబద్ధతను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తూ కార్మికుల సంక్షేమానికి, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బండి సంజయ్, గౌతమ్, కాసం వెంకటేశ్వర్లు, అందె శ్రీనివాస్‌తో పాటు జిల్లా అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్, బొక్క నరసింహ రెడ్డి, తోకల శ్రీనివాసరెడ్డి, వై. శ్రీధర్, మోండ్ర కొమరయ్యలకు ఉమా రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
