తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : వర్కలా కావ్య, పన్యాల సురేష్ కుమార్ వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు టీపీసీసీ కార్యదర్శి పార్వతల రాజేందర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పార్వతల రాజేందర్ మాట్లాడుతూ.. వర్కలా కావ్య, పన్యాల సురేష్ కుమార్ నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న శుభసందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ జేశారు దంపతులు పరస్పర అవగాహన, ప్రేమానురాగాలు, నమ్మకంతో జీవితాన్ని కొనసాగిస్తూ సుఖసంతోషాలతో కలకాలం కలిసి ఉండాలని ఆకాంక్షించారు. వారి వైవాహిక జీవితం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకలో బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన దంపతులకు అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేశారు. కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాల మధ్య వివాహ వేడుక ఘనంగా జరిగింది.