తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి మొగల్స్ కాలనీ అభివృద్ధికి ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ చేస్తున్న కృషి అభినందనీయమని మొగల్స్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీపీసీసీ మైనారిటీ విభాగం మాజీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ఖాదర్ పేర్కొన్నారు.
కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి ఎమ్మెల్యే చొరవ తీసుకుని రహదారుల నిర్మాణ పనులు చేపట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే మొగల్స్ కాలనీలోని 14వ వీధి, 12వ వీధిలో పూర్తి స్థాయిలో రహదారి నిర్మాణ పనులు పూర్తయ్యాయని, 4వ వీధిలో సగం మేర రహదారి పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ పనుల ద్వారా కాలనీ ప్రజలకు రాకపోకల్లో ఎంతో సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు.
కాలనీ అభివృద్ధికి సహకరిస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు కాలనీ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఇంకా పెండింగ్‌లో ఉన్న 3వ వీధి, ఎస్ఎస్ హోటల్ వెనుక భాగంలోని వీధులు, మొగల్స్ కాలనీలోని ఇతర అంతర్గత రహదారుల నిర్మాణ పనులను కూడా త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. మిగిలిన పనులు సైతం పూర్తయితే కాలనీవాసులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాలనీ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మహమ్మద్ ఖాదర్ తెలిపారు.
