తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ పరిధిలోని పత్తికుంట చెరువు వద్ద నిర్వహించిన ఛట్ పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షుడు పడమటి శ్రీధర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఛట్ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాపోలు సత్తయ్య, ముడిమాల శ్రీకాంత్ ముదిరాజ్, శివ ముదిరాజ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.