తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  రాజేంద్రనగర్ మండల పరిధిలోని నేతాజీనగర్ వెంకటేశ్వర కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపన్యాసాలు,పాటలు, నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. పాఠశాల ప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయులు బాలల దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులకు సందేశం అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మహమ్మద్ మోహిత్ 210 మంది విద్యార్థులకు పెన్సిల్ కిట్లు, కాంపాక్స్‌లను బహుకరించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో పాటు మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.విద్యార్థులకు విద్యా సామగ్రిని అందించిన మహమ్మద్ మోహిత్‌కు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రమీల, ఉపాధ్యాయులు మమత, మహేశ్వర్, లక్ష్మి, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

You missed