తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు, నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.పార్టీ నేత కార్తీక్ రెడ్డి సమక్షంలో వారంతా బీఆర్‌ఎస్ పార్టీలో చేరగా, కార్తీక్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

You missed