తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజేంద్రనగర్ మండలం ప్రేమావతిపేట్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కామన్ ప్లాట్‌ఫామ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థులందరికీ స్కేళ్లు, చాక్లెట్లు పంపిణీ చేసి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి క్రాంతి వర్మ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అని, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యతో పాటు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారిలో చదువుపై ఆసక్తిని పెంపొందించడం ఎంతో అవసరమనిఅన్నారు.విద్యార్థుల్లో ఆనందాన్ని నింపడంతో పాటు విద్య పట్ల ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కామన్ ప్లాట్‌ఫామ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

You missed