తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని నల్లగండ్ల ప్రాంతంలోని శిశు మంగళ అనాథ ఆశ్రమంలోని బాలబాలికలకు బాలల దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి సీనియర్ నాయకులైన అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేక భోజనం ఏర్పాటుచేసి వారితో కలిసి భారత దేశ మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మ దిన సందర్భంగా చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం, అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులుగా నమ్మిన నెహ్రూకి పిల్లలు అంటే అమితమైన ప్రేమ అని అందుకే ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న రాహుల్ గాంధీ కి స్వాగతం తెలిపారు. గిగ్ వర్కర్స్ కోసం ప్రత్యేకంగా చట్టం చేయడాన్ని అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాబినెట్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు