తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన భారత్ సమ్మిట్ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బి. మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ హాజరయ్యారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యం, శ్రీరంగం, తూము వేణు, చున్నుపాస, తూము సంతోష్, మస్తాన్ రెడ్డి, రాజేష్ గౌడ్, చందర్ రావు, వాజిద్ పాషా, మల్లికార్జున్ యాదవ్, నరసింహ, అస్లాం,రమణ, రంగమోహన్, శివ చౌదరి, సచిన్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, భారత్ సమ్మిట్ అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని, ప్రపంచంలోని 70 దేశాల నుంచి 1,000 మందికి పైగా ప్రతినిధులు, ప్రముఖ నాయకులు, మేధావులు పాల్గొనడం మన హైదరాబాద్‌కు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ప్రపంచ శాంతి, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ సహకారం వంటి కీలక అంశాలపై ఈ సమ్మిట్‌లో జరిగిన చర్చలు ప్రపంచ భవిష్యత్తుకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య విలువలకు, సమానత్వానికి, సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల కాపాడటం, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఇలాంటి అంతర్జాతీయ స్థాయి సదస్సులకు హైదరాబాద్ వేదిక కావడం తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచుతుందని బండి రమేష్ పేర్కొన్నారు.