తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్: ప్రజాసేవే లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ సహకారంతో, నివ్రితి హోమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సౌజన్యంతో మియాపూర్, మక్తా మహబూబ్పేట్ డివిజన్ పరిధిలోని నివ్రితి హోమ్స్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ విజయవంతమైంది. ఈ శిబిరం ద్వారా 300 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. పేద ప్రజలకు ఉచిత వైద్యం ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం ఈ శిబిరంలో 300మందికి పైగా ప్రజలు వివిధ ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, నిపుణులైన వైద్యుల సలహాలు, అవసరమైన మందులు, ఆరోగ్య మార్గదర్శకాలను ఉచితంగా పొందారు. మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ సహకారంతో ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య సేవలు పొందలేని కుటుంబాలకు అండగా నిలవడం, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ, పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. యలమంచి ఉదయ్ కిరణ్ ప్రజల పట్ల అంకితభావంతో పనిచేస్తున్న యువ నాయకుడని, ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులోనూ తన సహకారం ఉంటుందని తెలిపారు. సేవ నుంచి ప్రజా నాయకత్వం వరకు.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి యలమంచి ఉదయ్ కిరణ్ మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమావేశాలు, సభ్యత్వ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారం, ఓటరు అవగాహన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. మియాపూర్, మక్తా మహబూబ్పేట్, మయూరి నగర్ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, ట్రాఫిక్ వంటి స్థానిక సమస్యలను ప్రజల నుంచి తెలుసుకుని, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, పరిష్కారం కోసం సమన్వయం చేయడంపై దృష్టి సారిస్తున్నారు. విద్య, యువత, సామాజిక సంక్షేమానికి ప్రాధాన్యం ఉన్నత విద్యావంతుడైన యలమంచి ఉదయ్ కిరణ్ విద్యను సామాజిక అభివృద్ధికి పునాదిగా భావిస్తూ, పేద విద్యార్థులకు పుస్తకాలు, నోట్‌బుక్స్, జ్యామితీ పెట్టెలు, ఇతర విద్యా సామగ్రి పంపిణీతో పాటు అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రీడా పోటీలు, క్రీడా సామగ్రి పంపిణీ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య, కంటి పరీక్షల శిబిరాలు, వేసవి చలివేంద్రాలు, వృద్ధులకు పండ్ల పంపిణీ, అనాథాశ్రమాల్లో అన్నదానం, దివ్యాంగులకు సహాయం, పేద కుటుంబాలకు తోడ్పాటు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పారిశుధ్య కార్మికులకు ఆహార పంపిణీ, మట్టి వినాయక విగ్రహాల ప్రోత్సాహం వంటి కార్యక్రమాల ద్వారా కూడా సామాజిక బాధ్యతను చాటుతున్నారు. డిజిటల్ వేదికల్లో 65కే ఇన్ష్టాగ్రాం ఫాలోవర్లతో ప్రత్యేక గుర్తింపు ప్రజా సమస్యలు, సేవా కార్యక్రమాలు, అభివృద్ధి అంశాలను డిజిటల్ వేదికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యలమంచి ఉదయ్ కిరణ్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అరవై ఐదు వేలకు పైగా ఫాలోవర్లతో శేరిలింగంపల్లి రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియా పరంగా టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తూ, గణనీయమైన ప్రజా పరిచయాన్ని ఏర్పరుచుకున్నారు. ఆధునిక డిజిటల్ కమ్యూనికేషన్ పద్ధతులను ప్రజాసేవకు ఉపయోగిస్తూ, యువతతో నిరంతర అనుసంధానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, సేవా కార్యక్రమాల సమాచారాన్ని విస్తృతంగా ప్రజలకు చేరవేయడం ద్వారా డిజిటల్ వేదికలను ప్రజాసేవకు ఉపయోగిస్తున్నారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య సేవలు అందించేందుకు సహకరిస్తున్న మమతా హాస్పిటల్ యాజమాన్యానికి యలమంచి ఉదయ్ కిరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో నిర్వహించిన వైద్య శిబిరాల ద్వారా పలువురు లబ్ధిదారులకు మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు, కంటి ఆపరేషన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, సీటీ స్కాన్లు తదితర వైద్య పరీక్షలు, చికిత్సలు ఉచితంగా అందించడంలో మమతా హాస్పిటల్ అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.
సామాజిక సేవకు గుర్తింపులు సామాజిక సేవా రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా యలమంచి ఉదయ్ కిరణ్ సేవా రత్న జాతీయ పురస్కారం, ప్రెస్ వింగ్స్ క్లబ్ బెస్ట్ అచీవ్మెంట్ అవార్డు, కమ్మ ఐకాన్ ట్రస్ట్ సేవా రత్న అవార్డుతో పాటు సామాజిక సేవకు సంబంధించిన గౌరవ డాక్టరేట్ అందుకున్నట్లు ఆయన అందించిన వివరాలు పేర్కొంటున్నాయి. దాతలకు, సహకరించిన సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు ఈ మెగా మెడికల్ క్యాంప్ విజయవంతానికి సహకరించిన దాతలకు, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ యాజమాన్యానికి యలమంచి ఉదయ్ కిరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించినందుకు హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన నివ్రితి హోమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పబ్బ వేణు గోపా, జనరల్ సెక్రటరీ ప్రసూన్ చిలుకూరి, సుధాకర్ ఆత్మకూరి, శ్రీనివాస్ జాంపల్లి, సాయి గణేష్ మారిశెట్టి, రాఘవేంద్ర ఆకుల, నాగరాజు కొవ్వి, హేమంత్ రెడ్డి మాడ, అలేఖ్య రెడ్డి ,అనిల్, జగన్మోహన్ రావు,శేఖర్ అదేవిధంగా స్థానిక నాయకులు, వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరి సమిష్టి సహకారంతోనే ఈ సేవా కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షులు నర్సింగ్ రావు, చంద్ర మౌళి,రావిపాటి వెంకటేశ్వర్లు,బాబ్జీ,శ్రీమతి సింధూర,నాగేశ్వర రావు,శ్రీకాంత్, శ్రీనివాసు,శరత్, మధు,రాధకృష్ణ,ప్రవీణ్,వంశీ, రత్నాచారి, సాయినిఖిల్,వినోద్,గిరి,అనిల్,కామినేని వాసు, కార్తీక్, వలభనేని నరసింహరావు, ప్రకాష్, సత్య, శేషగిరిరావు , శేఖర్, సుబ్బారావు, నరసింహారావు, శ్రీజిత్,రమేష్,గోపాల్, రాజేష్,వాసు,చాణుక్య,మహేష్, సుజాత, పద్మ, సత్యం, తదితర నాయకులు, కార్యకర్తలు, పలువురు కాలనీవాసులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మియాపూర్ నుంచి తెలంగాణ వ్యాప్తంగా సేవా సంకల్పం యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజ సేవ, మానవతా విలువలు, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజాభివృద్ధికి తన వంతు కృషిని కొనసాగించనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. “మానవ సేవే మాధవ సేవ” యలమంచి ఉదయ్ కిరణ్ ఈ సందర్భంగా యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే మా ప్రధాన ప్రాధాన్యం. ఈ మెగా మెడికల్ క్యాంప్ ద్వారా 300 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం సంతోషంగా ఉంది. ప్రజాసేవ అనేది ఒక్కరోజుతో ముగిసే కార్యక్రమం కాదు నిరంతరం కొనసాగించాల్సిన బాధ్యత. విద్య, వైద్యం, యువజన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సంక్షేమ రంగాల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అండగా నిలుస్తాం అని తెలిపారు. సేవతో సంపాదించిన విశ్వాసం ప్రజల సంక్షేమమే మా సంకల్పం అనే ఆశయంతో తన సేవా ప్రయాణాన్ని కొనసాగిస్తానని ఉదయ్ కిరణ్ పేర్కొన్నారు.
