తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, పాపిరెడ్డి కాలనీలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో మాజీ ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ వేడుకలను మదర్ సేవా సమితి సోషల్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దం కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బద్దం కొండల్ రెడ్డి చేతులమీదుగా కెక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్స్ , బిస్కెట్ లు పంపిణి చేసారు. అనంతరం, పాఠశాల హెచ్ఎమ్ కుర్మా రావును, ఉపాద్యాయులు వెంకట్ రెడ్డి, హరీష్ రెడ్డి, విమల, అనిత, తదితరులను శాలువాలతో ఘనంగా సన్మానించి మెమొంటోలను బహుకరించారు. ఈ సందర్బంగ బద్దం కొండల్ రెడ్డి మాట్లాడుతు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి, ప్రతి ఒక్కరికీ విద్యా అవకాశాలు కల్పించేందుకు కృషి చేసిన మహానేత అని కొనియాడారు. 2005వ సంవత్సరంలో మదర్ సేవ సమితి సోషల్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించటం జరిగిందని నేటికి ఇరవైఒక్క (21) వసంతాలు అని, ఇప్పటివరకు ప్రభుత్వ స్కూల్ వద్ద ఉచితంగా నోట్ బుక్స్, బ్యాగ్స్ , ఆటవస్తువులను విద్యార్థులకు ఇచ్చామని ప్లాస్టిక్ నివారణ కోసం 18వేల గన్ని బాగులను ప్రత్యేకంగా తయారు చేయించి వివిధ కూరగాయల మార్కెట్లలో బస్తిలలో ఉచితంగా పంపిణి చేసామని, పలు హోటల్ల వద్ద స్టీల్ జగ్గులు, వాటర్ గ్లాసులు, టీ గ్లాసులు, అందించామని ప్లాస్టిక్ నివారణ కోసం కృషి చేసామని, ఇక ముందు కూడా మదర్ సేవా సంస్థ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బస్తి వాసులు ఎమ్ రమేష్, పీ. రాంబాబు, ఎస్పీ రెడ్డి పాల్గొన్నారు.
