తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, పాపిరెడ్డి కాలనీలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో మాజీ ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ వేడుకలను మదర్ సేవా సమితి సోషల్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దం కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సందర్బంగ వార్తా సేకరణకై విచ్చేసిన స్థానిక సీనియర్ పాత్రికేయులైన కొండా శ్రీనివాసు ను బద్దం కొండల్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయుల సమక్షంలో మర్యాదపూర్వకంగా స్వాగతించి, గౌరవప్రదంగా శాలువాలతో సత్కరించి, మెమొంటోను బహుకరించారు. ఈ సందర్భంగా పాత్రికేయులైన కొండా శ్రీనివాసు మాట్లాడుతూ, పత్రికారచయితల విలువలను గుర్తించిన మహానుభావులే పాత్రికేయులను గౌరవప్రదంగా స్వాగతిస్తూ, సత్కరిస్తారని, ఈ గౌరవసత్కారం పాత్రికేయులందరి విలువలను పెంపొందించగలదని ఆనందం వ్యక్తంచేశారు