తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: జాతీయ పత్రికా దినోత్సవ సందర్బాన్ని పురస్కరించుకుని మదర్ సేవా సమితి సోషల్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దం కొండల్ రెడ్డి మనస్ఫూర్తిగా పాత్రికేయులందరికి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బద్దం కొండల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పత్రికా రంగం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తోందని, ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో వారి కృషి, పట్టుదల అభినందనీయమని, జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.