తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి మండల విద్యాధికారి వెంకటయ్య ను స్థానిక పాత్రికేయులు కొండా శ్రీనివాసు మర్యాదపూర్వకంగా కలిసారు. అనంతరం, మండలంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న విద్యాలయాల పర్యవేక్షణపై ఎంఈఓ.తో చర్చించారు. ప్రతి పాఠశాలను సందర్శించి వాటిపై తగురీతిలో పరిశీలన జరిపి విద్యార్థులకు న్యాయమైన బోధన అందేలా చర్యలు చేపట్టి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని విన్నవించారు. చర్చలపై ఎంఈఓ వెంకటయ్య సానుకూలంగా స్పందించారు. తప్పకుండా గుర్తింపులేని పాఠశాలలపై తగురీతిలో చర్యలు చేపట్టి విద్యార్థుల భవిష్యత్తు కాపాడుతామని తెలిపారు.