తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి మండల రెవెన్యూ కార్యాలయ సమీపంలో నూతనంగా ఏర్పాటుచేసిన బోరు ను శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) మహిపాల్ రెడ్డి వారి కార్యాలయ సిబ్బందితో కలిసి స్వయంగా నూతన బోరును శాస్త్ర యుక్తంగా పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసి ఆచారయుక్తంగా కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం, ఆనందోత్సాహాల మధ్య ఎమ్మార్వో తన చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీ మణికంఠ బోర్ వెల్స్ యాజమాన్యం సిహెచ్ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో వారి బోరు మిషన్తో ఈ బోరు వేయటం జరిగిందని, శ్రీ మణికంఠ స్వామివారి ఆశీస్సులతో గంగమ్మ తల్లి కరుణతో విశిష్టమైన రీతిలో నీటి సదుపాయాన్ని అందించినందుకు శ్రీ మణికంఠ బోర్ వెల్స్ యాజమాన్యులైన సిహెచ్ బాల్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది, బోరు యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు