తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఫతేనగర్ డివిజన్‌లోని శివాలయం సమీపంలో బిహారీ సోదరులు నిర్వహించిన ఛట్ పూజ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, ఛట్ పూజ అనేది ప్రకృతి ఆరాధనకు, సూర్య భగవానుడి పట్ల భక్తి విశ్వాసాలకు ప్రతీక అని పేర్కొన్నారు. మన దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ తమ సంప్రదాయాలు, ఆచారాలను పాటిస్తూ పండుగలను జరుపుకోవడం భారతీయ సంస్కృతిలోని ప్రత్యేకత అని అన్నారు. అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలకు చెందిన ప్రజలు సోదరభావంతో, ఐకమత్యంతో కలిసి మెలిసి ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ ఛట్ పూజ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో క్రాంతి, సూరజ్ తివారి, లక్ష్మయ్య, ఇజాజ్, నరసింహ, శ్రవణ్, ఎల్. నర్సింగ్, కిరణ్, తమిళ్, రవి తదితరులు పాల్గొన్నారు.