తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ ఏ బ్లాక్‌కు చెందిన సీనియర్ పోలీస్ అధికారి తోట వెంకటరమణ , శ్రీమతి తోట విజయలక్ష్మిల కుమారుడు తోట కార్తీక్ అయ్యప్ప స్వామి మాలధారణ సందర్భంగా వారి స్వగృహంలో అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి వారి ఆహ్వానం మేరకు కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ హాజరై అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తితో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం, తీర్థప్రసాదాలు స్వీకరించి, స్వామి తోట కార్తీక్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా షేక్ హమీద్ పటేల్ మాట్లాడుతూ, తోట వెంకటరమణ కుటుంబంతో తనకు ఎన్నో సంవత్సరాలుగా మంచి పరిచయం ఉందని తెలిపారు. పోలీస్ అధికారిగా తోట వెంకటరమణ ప్రజలకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. అదేవిధంగా వారి సతీమణి తోట విజయలక్ష్మి కాలనీలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ స్థానిక ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు తోట వెంకటరమణ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, ఆ కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.?అదేవిధంగా అయ్యప్ప స్వామి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ప్రసరించి, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, సంతోషాలు నింపాలని ప్రార్థిస్తున్నట్లు షేక్ హమీద్ పటేల్ తెలిపారు.
