తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కొండాపూర్ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా అన్నప్రసాదం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మానవ సేవయే మాధవ సేవ అని పెద్దలు చెప్పిన సూక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై, ఆర్థికంగా సహకరించి విజయవంతం చేశారు. వందలాది మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా లింగంపల్లి మండల్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మాశెట్టి ప్రభాకర్ సంఘం సేవ కోసం 2స్టీల్ టేబుల్స్ అందజేశారు. వారికి సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కొండాపూర్ ఆర్య వైశ్య సంఘం యువజన విభాగం అధ్యక్షులు దినేష్ గుప్తా సతీమణి శ్రీమతి నవీన్ గుప్తా పుట్టిన రోజు నవంబర్ నెలలో పురస్కరించుకొని, వారి దంపతులు సంఘానికి స్టీల్ గ్లాసులు, స్టీల్ జగ్గులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, యువజన విభాగం సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
