తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, గోపిచెరువు వద్ద గోపినగర్ బీహార్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఛత్ పూజ మహోత్సవంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, సూర్య భగవానుడిని, ఛతి మైయ్యను ఆరాధించే ఈ ఛత్ పూజ మహోత్సవం భక్తి క్రమశిక్షణకు ప్రతీక అని అన్నారు. బీహార్ సోదరులు తమ సంప్రదాయాన్ని సంస్కృతిని హైదరాబాద్ నగరంలో కూడా ఇంత ఘనంగా కొనసాగించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా అందరూ కలిసి పండుగలు జరుపుకోవడమే మన భారతీయ సంస్కృతి గొప్పతనమని గోపినగర్ బీహార్ అసోసియేషన్ వారికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం, ఛత్ పూజలో పాల్గొన్న భక్తులకు శుభాకాంక్షలు తెలిపి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గోపినగర్ బీహార్ అసోసియేషన్ సభ్యులు విక్రాంత్ యాదవ్, గోపి నగర్ అంబేద్కర్ భవన్ ప్రెసిడెంట్ రమేష్, ప్రభాకర్ యాదవ్, సైదులు యాదవ్, కృష్ణ గుప్తా, రామదార్ గుప్తా, సతేందర్ గుప్తా, మోహన్ గుప్తా, రాకేష్ యాదవ్, నరేందర్ గుప్తా, సంజయ్ యాదవ్, దుర్గేష్ గుప్తా, జితేందర్ గుప్తా,భక్తులు తదితరులు పాల్గొన్నారు.