తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, వేలేరు: పేదలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో 81 నూతన ఆసరా పింఛన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా నూతన పింఛన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫ్లెక్సీలకు వేలేరు సర్పంచ్ బిల్లా యాదగిరి ఆధ్వర్యంలో లబ్ధిదారులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో 81 నూతన ఆసరా పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. నూతనంగా ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసినట్లు పేర్కొన్నారు. మరో 20 పింఛన్ల దరఖాస్తులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

కొత్త పింఛన్లతో నిరుపేదలు, వృద్ధులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా లభిస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మరోసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, జీపీ కార్యదర్శి విజయ, సర్పంచులు శ్రీనివాస్, రాజు, అరుణ నాగరాజు, వార్డు సభ్యులు ప్రశాంత్, పర్వీన్, లక్ష్మీనారాయణ, చైతన్య, సురేష్, సునీల్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో పింఛన్ లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Avatar photo

By Murthy