తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కొండాపూర్ వాస్తవ్యులు నన్నపనేని మురళి కిషోర్, శ్రీమతి పద్మలత దంపతుల కుమారుడు చిరంజీవి సాయి వినయ్ కిషోర్, చిరంజీవి లక్ష్మి ల వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ తో కలిసి కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆత్మీయంగా అభినందించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
