తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆడిటోరియంలో నూతన చేయూత పెన్షన్ మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ హాజరై లబ్ధిదారులకు నూతన చేయూత పెన్షన్ మంజూరీ పత్రాలను పంపిణీ చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యాదవ సహకార కార్పొరేషన్ చైర్మన్ మారబోయిన రఘునాథ్ యాదవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలోని పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ,ఇతర అర్హులైన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పెన్షన్ ద్వారా లబ్ధిదారులకు ప్రతినెలా ఆర్థిక సహాయం అందడంతో వారి నిత్యజీవిత అవసరాలకు కొంతమేర భరోసా లభిస్తుందని తెలిపారు. ప్రజల సంక్షేమం, సామాజిక భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
