తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి సర్కిల్ 49,శేరిలింగంపల్లి జోన్ పరిధిలో నూతన చేయూత పెన్షన్ మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ, జోనల్ కమీషనర్ నారాయణ్ అమిత్ మలేంపాటి ఐఏఎస్ , తెలంగాణ యాదవ కురుమ కోఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మెన్ ఎం. రఘునాథ్ యాదవ్, డిప్యూటీ కమీషనర్ ఇస్లావత్ నాయక్, కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చేయూత పెన్షన్ లబ్దిదారులకు మంజూరీ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పెన్షన్ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితర అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్థిక భరోసా కలుగుతుందని తెలిపారు. అర్హులైన ఏ ఒక్క లబ్దిదారుడు కూడా పెన్షన్ కు దూరం కాకూడదనే ఉద్దేశంతో డివిజన్ లోని ప్రతి బస్తీ, కాలనీలో సర్వే చేయించి అర్హులైన వారందరికీ పెన్షన్ అందేలా కృషి చేస్తామని ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుంటామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, అధికారులు, వార్డ్ మెంబర్ కవిత, వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం, స్థానిక నాయకులు, కార్యకర్తలు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.
