తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రబోడ ఉప్పర్పల్లి ప్రాంతంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ విద్యుత్ శాఖ ఏఈ దుర్గాప్రసాద్, శాఖ సిబ్బంది పాల్గొని స్థానిక ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, విద్యుత్ లైన్ల మరమ్మతులు, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయడం, లూప్ లైన్ల నిర్వహణ వంటి పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడంతో పాటు విద్యుత్ సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించడమే విద్యుత్ ప్రజాబాట కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
