తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందించే దిశగా చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో కొత్తగా 4,092 మంది లబ్ధిదారులు పెన్షన్లకు ఎంపిక కావడం విశేషమని తెలిపారు. మున్సిపల్ సర్కిళ్ల వారీగా ఎంపికైన వారి వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపల్ సర్కిళ్ల వారీగా కొత్త పెన్షన్ల ఎంపిక: కూకట్పల్లి సర్కిల్ 705 మంది, మూసాపేట సర్కిల్, 2,179 మంది, ఓల్డ్ బోయిన్పల్లి సర్కిల్, 1,208 మంది, మొత్తం 4,092 మంది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితర అర్హులైన నిరుపేద కుటుంబాలకు పెన్షన్ అందించడం ద్వారా వారి జీవనానికి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ సంక్షేమ లక్ష్యమని పేర్కొన్నారు. అదేవిధంగా అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డుల మంజూరు, కొత్త రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడం వంటి అంశాలకు కూడా ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ మాట్లాడుతూ, తన నాయకత్వంలో నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా నిరంతరం కృషి చేయడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందినప్పుడే ప్రజా పాలనకు నిజమైన అర్థం చేకూరుతుందని బండి రమేష్ అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంకల్పమని ప్రజల సంక్షేమమే ప్రాధాన్యం అర్హులందరికీ ప్రభుత్వ పథకాలే భరోసా ఇదే రేవంత్ రెడ్డి ప్రజా పాలన లక్ష్యమని తెలిపారు.
