తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా రాంపెల్లి లింగమూర్తి నియ మితులయ్యారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ప్రస్తుతం చేనేత ఐక్య వేదిక రాష్ట్ర మీడియా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లింగమూర్తి సేవలను గుర్తించిన జాతీయ నాయకత్వం ఆయనకు ఈ కీలక బాధ్యతలు అప్పగించింది.ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. బీసీల హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం తన వంతు కృషి చేస్తానని, జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.