తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి మండల ఆర్యవైశ్య మహాసభ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా మదీనాగూడ ఆర్యవైశ్య మహాసభ సభ్యుల నియామకం చేశారు. ఈ క్రమంలో మదీనాగూడ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా శేరిలింగంపల్లి మండల ప్రాంతంలోని ప్రముఖ వ్యాపారవేత్త గజవాడ లక్ష్మీ నరసింహరావు, జనరల్ సెక్రటరీ కంకటాల రాజేష్ , ట్రెజరర్ వంశీ లు శేరిలింగంపల్లి మండల సంఘం వారి ఆధ్వర్యంలో నియమించబడ్డారు. ఈ సందర్బంగా శేరిలింగంపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మాశెట్టి ప్రభాకర్ గుప్తా, జనరల్ సెక్రెటరీ పోలా కోటేశ్వరరావు, రాష్ట్ర యువజన సంఘం సెక్రటరీ ముక్కా పృథ్వి గుప్తా, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మారం వెంకట్ దోగిపర్తి నాగమల్లేశ్వరరావు, మండల ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు శ్రీ హరి కలిసి నూతనంగ నియమించబడిన అధ్యక్షులు గజవాడ లక్ష్మీనరసింహారావును జనరల్ సెక్రటరీ కంకటాల రాజేష్ ను గౌరవప్రదంగా శాలువాలతో సత్కరించారు.
