తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: చందానగర్‌లోని అంబేద్కర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన చేయూత పింఛన్ మంజూరు కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ తో కలిసి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు మల్లెల జయ పాల్గొన్నారు. ఈ సందర్బంగ మల్లెల జయ మాట్లాడుతు, ఈ పథకం ద్వారా అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు నెలవారీ ఆర్థిక సహాయం అందిస్తూ వారి ఆత్మగౌరవం, ఆర్థిక భద్రత, మెరుగైన జీవన ప్రమాణాలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని, అవసరంలో ఉన్నవారికి అండగా బలహీన వర్గాలకు భరోసాగా సామాజిక భద్రతను బలోపేతం చేస్తూ సంక్షేమ తెలంగాణ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నదని అన్నారు.