తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: చందానగర్‌లోని అంబేద్కర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన చేయూత పింఛన్ మంజూరు కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో పాల్గొన్నారు. అదేవిధంగా జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ అల్లంపాటి, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్ కూడా పాల్గొని ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి తమ మద్దతును తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2026 నవంబర్‌లో వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ప్రారంభమైన చేయూత పింఛన్ పథకం, తెలంగాణలో సామాజిక భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు ఈ పథకం ద్వారా అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు నెలవారీ ఆర్థిక సహాయం అందిస్తూ వారి ఆత్మగౌరవం, ఆర్థిక భద్రత, మెరుగైన జీవన ప్రమాణాలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని అవసరంలో ఉన్నవారికి అండగా బలహీన వర్గాలకు భరోసాగా
సామాజిక భద్రతను బలోపేతం చేస్తూ సంక్షేమ తెలంగాణ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నదని అన్నారు.
