తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: చందానగర్‌లోని అంబేద్కర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన చేయూత పింఛన్ మంజూరు కార్యక్రమంలో శేరిలింగంపల్లి అసెంబ్లీ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ లతో కలిసి చందానగర్ డివిజన్ తాజా మాజీ కార్పోరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రారంభమైన చేయూత పింఛన్ పథకం, తెలంగాణలో సామాజిక భద్రతను మరింత బలోపేతం చేస్తుందని, ఈ పథకం ద్వారా అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు నెలవారీ ఆర్థిక సహాయం అందిస్తుందని, అవసరంలో ఉన్నవారికి అండగా బలహీన వర్గాలకు భరోసాగా సామాజిక భద్రతను బలోపేతం చేస్తూ సంక్షేమ తెలంగాణ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ అల్లంపాటి, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.