తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కార్యక్రమంలో పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో పాటు చందానగర్ డివిజన్ తాజా మాజీ కార్పోరేటర్ మంజుల రఘునాద్ రెడ్డి పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ పాటించిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
